ఎనర్జిటిక్ గా కనిపిస్తోన్న సమంత!

Samantha

సమంతకి ఆరోగ్యం బాలేదు అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు కదా. ఆమె చాలా కాలంగా మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం కూడా మనకి తెలుసు. ఆ కారణంగానే ఆమె సినిమాల్లో నటించడం లేదు. కొన్నాళ్లు సినిమా షూటింగ్ ల నుంచి బ్రేక్ కావాలంటూ ఆమె సినిమాలకు దూరమయ్యారు.

ఐతే, సినిమాలు తప్ప మిగతావన్నీ చేస్తున్నారు. చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న వైనమూ కనిపిస్తూనే ఉంది.

తాజాగా ఆమె ఎంటీవీ నిర్వహించిన ‘హసల్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆమె చేసిన రచ్చ చూస్తుంటే ఒకప్పుడు ఎంత యాక్టివ్ గా ఉండేవారో అలా కనిపించడం విశేషం. ఆమె ఎనర్జీ చూస్తుంటే ఆమె ఆరోగ్య స్థితి ఇప్పుడు బాగున్నట్లు కనిపిస్తుంది. అలాగే ఆమె అనేక టూర్లు కూడా చేస్తున్నారు.

సో, సమంత త్వరలోనే మళ్ళీ సినిమాల్లో నటించే అవకాశం ఉంది. 2024లో ఆమెని మళ్ళీ వెండితెరపై చూస్తాం.

Advertisement
 

More

Related Stories