సమంతకి ఇప్పట్లో తగ్గేలా లేదా?

Samantha


సమంత గత కొంతకాలంగా మాయోస్టిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. మొన్నామధ్య ‘యశోద’ విడుదల సమయంలో ఆమె కోలుకున్నట్లు కనిపించారు. నెల రోజుల్లో ఆమె బయటికి వచ్చి షూటింగ్ చేస్తారు అన్న మాట కూడా వినిపించింది. కానీ, తాజా సమాచారం ప్రకారం ఆమె పరిస్థితిలో ఈ మార్పు లేదు. ఇంకా ఆమె కోలుకోలేదు.

ఐతే, ట్రీట్మెంట్ కోసం ఆమె దక్షిణ కొరియా వెళ్ళింది అన్న వార్తల్లో కూడా నిజం లేదు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోనే తన ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయించుకున్నట్లు సమాచారం.

సమంత అస్సలు బయటికి అడుగుపెట్టడం లేదు. ఆమె టీం కూడా పెద్దగా ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. సమంత గత నెలల్లో కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది. కానీ ఇప్పుడు ఆ అప్డేట్స్ కూడా లేవు.

సమంత కొత్తగా సినిమాలు ఒప్పుకునే విషయంలో కూడా క్లారిటీ లేదు. విజయ్ దేవరకొండతో ఆమె చెయ్యాల్సిన ‘ఖుషి’ షూటింగ్ మొత్తం పూర్తి చెయ్యాలి. అది ముఖ్యం.

 

More

Related Stories