ఆమె తప్ప అంతా బయటకొచ్చారు

లాక్ డౌన్ తర్వాత బాగా యాక్టివ్ అయిన సినీ కుటుంబం ఏదైనా ఉందంటే అది అక్కినేని ఫ్యామిలీ మాత్రమే. ఈ కుటుంబానికి చెందిన హీరోలంతా ఇప్పుడు సెట్స్ పైకి వచ్చేశారు.

అందరికంటే ముందే నాగార్జున, “వైల్డ్ డాగ్” సినిమాతో సెట్స్ పైకి వచ్చేశారు. ఆ తర్వాత నాగచైతన్య కూడా తన “లవ్ స్టోరీ”ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” కోసం అఖిల్ కూడా సెట్స్ పైకి వచ్చేశాడు.

“ఇచ్చట వాహనములు నిలపరాదు” అనే సినిమా కోసం సుశాంత్ కూడా పని మొదలుపెట్టాడు. ఈరోజు నుంచి సుమంత్ కూడా తన కొత్త సినిమా వర్క్ స్టార్ట్ చేశాడు.

ఇలా అక్కినేని కాంపౌండ్ కు చెందిన హీరోలంతా తమ సినిమాలు స్టార్ట్ చేశారు. ఈ లిస్ట్ లో మిస్ అయింది ఒకే ఒక్కరు. ఆమె సమంత. ఈ స్టార్ హీరోయిన్ మాత్రం ఇంకా లాక్ డౌన్ నుంచి బయటకు రాలేదు. కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు.

Related Stories