ఆ ఒక్కటి అడక్కు అంటున్న సమంత

సమంత సినిమాలు చేయడం లేదు. తన వ్యక్తిగత వ్యాపకాలు, వ్యాపారాలు చూసుకుంటోంది. ఈమధ్య బిగ్ బాస్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వెళ్లింది. ఓ యాప్ లో కొత్తగా యాంకరింగ్ కూడా షురూ చేసింది. ఇక యాడ్స్, తన బ్రాండ్స్ ఉండనే ఉన్నాయి. ఇలా తన స్పేస్ లో తను బిజీగా ఉంటున్న సమంత.. ఇక సినిమాలు చేయదేమో అనే అనుమానం అందర్లో ఉంది.

ఆ అనుమానాలకు మరింత ఊతమిచ్చేలా స్టేట్ మెంట్ ఇచ్చింది సమంత. లాక్ డౌన్ లో తానేంటో తెలుసుకున్నానని, తనకు ఏది అవసరమో గుర్తించానని అంటోంది సమంత. తనకు గార్డెనింగ్, యోగా అంటే ఇష్టమనే విషయం లాక్ డౌన్ పడే వరకు తెలియదంటున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఫేజ్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు, పాజిటివ్ గా ఉంటున్నట్టు ప్రకటించింది.

మరో 5-6 నెలలు ఇలానే ఉంటారా అనే ప్రశ్నకు సమాధానంగా.. ఆ ఒక్కటి అడక్కు అన్నట్టు రెస్పాండ్ అయింది. ప్రస్తుతం తన లైఫ్ లో తాను సరదాగా ఉన్నానని.. ఇంతకుమించి పెద్దగా ఏం కోరుకోవడం లేదని తెలిపింది.

సమంత మాటలు చూస్తుంటే.. ఆమె ఇప్పట్లో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేలా కనిపించడం లేదు. మరోవైపు నందినీరెడ్డి లాంటి డైరక్టర్లు మాత్రం సమంతతో సినిమా కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.

Related Stories