ఆ రూమర్లపై సమంత మౌనం!

- Advertisement -
Samantha Akkineni


మొన్నామధ్య సమంత ఉన్నట్టుండి తన పేరుని మార్చుకొంది. గత వారం రోజుల క్రితం వరకు ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ‘Samantha Akkineni’ (సమంత అక్కినేని) అని తన పేరుని వాడేది. కానీ ఇప్పుడు కేవలం “S” అనే అక్షరం ఉంచి మిగతాది అంతా తొలిగించింది. సమంత అన్న పేరులో ఉన్న మొదటి అక్షరం మినహా అన్ని అక్షరాలతో పాటు ఇంటిపేరు కూడా తీసెయ్యడంతో రకరకాల ఊహాగానాలు సాగాయి.

కానీ ఆ ప్రచారానికి ఆమె స్పందించలేదు. ఎందుకంటే. ఆమె ఇలా పేరు కుదించింది ఒక యాడ్ ప్రొమోషన్ కోసమంట. ఆమె ఒక ఫ్యాషన్ లేబెల్ కలెక్షన్ ప్రమోషన్ లో భాగంగా ఇలా చేసిందట.

సమంత సోషల్ మీడియా ద్వారా కోట్లు సంపాదిస్తోంది. ఒక్క ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఒక పోస్ట్ వేస్తె లక్షలు లక్షలు వస్తాయి. అందుకే, ఇప్పుడు ట్విట్టర్ లో యాక్టివిటీ తగ్గించింది సమంత. పూర్తిగా ఇన్ స్టాగ్రామ్ పైనే ఫోకస్. అలా సోషల్ మీడియాలో తన పేరును కూడా ప్రమోషన్ కి లింక్ చేసింది అన్నమాట.

సమంత ప్రస్తుతం గుణశేఖర్ తీస్తోన్న “శాకుంతలం” షూటింగ్ లో పాల్గొంటోంది. తెలుగులో మరో సినిమా సైన్ చెయ్యలేదు. స్లో అండ్ స్టడ్ అన్నట్లుగా ఉంది పాలసీ.

 

More

Related Stories