సమంత మరోసారి ఎత్తిపడేసింది!

ఫిట్ నెస్ విషయంలో ఇండియన్ హీరోయిన్స్ లో సమంత టాప్-5లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పవర్ లిఫ్టర్స్, బాడీ బిల్డర్స్, రగ్బీ ప్లేయర్లు చేసే ఎక్సర్ సైజులు కూడా సమంత చేస్తుంది. వాళ్ల రేంజ్ లో బరువులు ఎత్తేస్తుంది.

ఈ లాక్ డౌన్ టైమ్ లో లైట్ ఎక్సర్ సైజులు, యోగాకు మాత్రమే పరిమితమైంది సమంత. అలా కొన్ని రోజులుగా వెయిట్ లిఫ్టింగ్ కు దూరమైన ఈ బ్యూటీ.. మరోసారి వెయిట్ ట్రయినింగ్ ప్రొగ్రామ్ మొదలుపెట్టింది. ఈ మేరకు ఆమె తాజాగా ఓ పోస్టు పెట్టింది.

వెయిట్ లిఫ్టింగ్ లో సమంత హయ్యస్ట్ కౌంట్ 110 కిలోలు. ఈ మేరకు గతంలో ఆమె వీడియో కూడా పోస్ట్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు బరువులెత్తే కార్యక్రమం మొదలుపెట్టింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ, తనదైన స్పేస్ లో జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

Related Stories