భూటాన్ లో సమంత ధ్యానం!

Samantha

సమంత తాజాగా భూటాన్ లో విహరిస్తోంది. ఆమె అక్కడి నుంచి ఫోటోలను షేర్ చేస్తోంది ఇప్పుడు. తాజాగా ఒక ప్రకృతి రిసార్ట్ లో ధ్యానం చేస్తున్న ఫోటోని పోస్ట్ చేసింది.

భూటాన్ కి భూతల స్వర్గం అనే పేరుంది. ప్రకృతి రమణీయతకి పెట్టింది పేరు. రణగొణ ధ్వని నుంచి దూరంగా ప్రకృతి ఒడిలో సేదదీరాలనుకునేవారికి చక్కటి స్పాట్ ఇది. ప్రస్తుతం సమంత అదే చేస్తోంది. ఇటీవల ఆస్ట్రియా వెళ్లి వచ్చిన సమంత ఇప్పుడు భూటాన్ లో పర్యటిస్తోంది.

మయోసిటిస్ అనే వ్యాధితో ఏడాది కాలంగా బాధపడుతోంది సమంత. కొంతకాలం షూటింగ్ లకు దూరంగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “ఖుషి” సినిమా విడుదల కాగానే అన్ని సినిమాల పనులు ఆపేసింది. అంతకుముందు ఒప్పుకున్న సినిమాలను కూడా వదులుకొంది. సినిమాలు పక్కన పెట్టి టూర్లు చేస్తోంది. కోలుకునేందుకు ఈ మార్గం ఎంచుకొంది ఆమె.

సమంత ఒకవైపు యాడ్స్ లో నటిస్తోంది. బ్రాండ్స్ కి సంబందించిన ప్రమోషన్స్ చేస్తోంది. ఈవెంట్స్ అటెండ్ అవుతోంది. కానీ సినిమాలకు మాత్రం దూరంగా ఉంటోంది. బహుశా ఆమె కొత్త ప్రదేశాలకు వెళ్లడం ద్వారా మానసిక, శారీరక ఉల్లాసం పొందుతోందేమో. లేదా చికిత్సలో ఇది భాగమా?

Advertisement
 

More

Related Stories