ముంబైలో ఇంటికోసం అన్వేషణ!

నాగ చైతన్య, సమంతకి హైదరాబాద్ లో అందమైన ఇల్లు ఉంది. రీసెంట్ గా గోవాలో ఒక ఇల్లు కొనుక్కున్నారు. దానికి సంబంధించిన వర్క్ జరుగుతోంది. ఇప్పుడు ముంబైలో కూడా ఇల్లు కొనేందుకు చూస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నిజానికి ఈ జంటకి ముంబైలో ఇల్లు తీసుకోవాల్సినంత అవసరం లేదు. ‘ది ఫ్యామిలీ మేన్ 2’ సిరీస్ సక్సెస్ తర్వాత సమంతకి బాలీవుడ్ నుంచి కళ్ళు చెదిరే ఆఫర్లు వచ్చాయి. కానీ సమంత ఏవీ సైన్ చెయ్యలేదు. ఆమెకి బాలీవుడ్ కి షిఫ్ట్ కావాలనే ఆలోచన లేదు. ఇక ఆమె భర్త నాగ చైతన్య ప్రస్తుతం అమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’లో ఒక చిన్న పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమా విడుదలైన తర్వాత మరిన్ని అవకాశాలు వస్తే చేస్తాడేమో కానీ చైతన్య కెరీర్ మెయిన్ గా తెలుగులోనే ఉంటుంది. దానికి హైదరాబాద్ లోనే ఉండాలి.

ఐతే, ఇన్వెస్ట్ మెంట్ పర్పోజ్ లో ముంబైలో ఇల్లు కొనుక్కునే ఆలోచనలో ఉన్నారనుకోవాలి.

ఇటీవల రామ్ చరణ్ ముంబైలో ఇల్లు కొన్నాడట. అలాగే పలువురు టాలీవుడ్ తారలు అదే ఆలోచనలో ఉన్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ప్రభాస్ చాలాకాలంగా ముంబైలో పెద్ద బంగాళా కొనేందుకు ప్రయత్నిస్తున్నమాట వాస్తవమే. ఎందుకంటే, ప్రభాస్ నెలలో సగం రోజులు హైద్రాబాద్ లో, మిగతా రోజులు ముంబైలో ఉండాల్సిన పరిస్థితి.

Advertisement
 

More

Related Stories