ముంబైలో ఇల్లు కొనే ఆలోచన!


హీరోయిన్ రష్మిక ముంబైలో ఇల్లు కొనే ఆలోచనలో ఉందని ఇటీవల వార్తలు చూశాం. ఇప్పుడు సమంత పేరు కూడా వినిపిస్తోంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నాక ఆమె ఎక్కువగా ముంబైలోనే ఉంటోంది అన్న మాట నిజమే. హిందీలో ఒక వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోంది. అది కాకుండా, యాడ్స్, ఫోటోషూట్స్, మ్యాగజైన్ కవర్స్, ఫ్రెండ్స్… ఇలా ఎక్కువగా ముంబై చుట్టే ఆమెకి పని ఉంది.

దాంతో, ఆమె ముంబైలోనే నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ కి అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నారట.

ఇప్పుడు ఆమె సొంతంగా ఇల్లు తీసుకుందామని అనుకుంటున్నట్లు టాక్. త్వరలోనే ఆమె రెండు హిందీ చిత్రాలు సైన్ చెయ్యడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే, చర్చలు పూర్తి అయ్యాయి. ముంబై, బాలీవుడ్ పనులతో ఆమె మనసు అక్కడ సొంత ఇల్లు వైపు వెళ్లినట్లు కనిపిస్తోంది. ఐతే, ముంబైలో ఇల్లు కొనడం అంత ఈజీ కాదు. 15 నుంచి 30 కోట్లు పెట్టాలి.

నాగ చైతన్యతో హైదరాబాద్ లో కాపురం ఉన్న ఇల్లు ఆమె కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ అల్లు ఆమెదే. హైదరాబాద్ లో కొన్ని స్థలాలు కూడా ఉన్నాయి.

సమంత, ముంబై, సమంత ముంబై ఇల్లు,

 

More

Related Stories