
సమంత కొన్నాళ్ళూ గ్లామర్ ఫోటోషూట్ లకు దూరంగా ఉంది. గతేడాది లాక్డౌన్ టైంలో ఆమె ‘అర్బన్ ఫార్మింగ్’, ‘యోగ’ వంటి ఫోటోలను మాత్రమే షేర్ చేసింది. ఐతే, ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తోంది. మునుపటిలా ఎడాపెడా సినిమాలు ఒప్పుకోవడం లేదు. సెలెక్టీవ్ గా ఉంది. ప్రస్తుతం నయనతారతో ఒక మూవీ, గుణశేఖర్ తీస్తున్న ‘శాకుంతలం’ మాత్రమే చేస్తోంది. ఐతే, ఆమె మళ్ళీ గ్లామర్ ఫోటోషూట్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ నిండా అప్డేట్ చేస్తోంది.
సమంత తన భర్త చైతన్యతో కలిసి ఎక్కువగా బ్రాండ్స్ ఒప్పుకుంటోంది. ఆ యాడ్స్ లో నటిస్తోంది. దాంతో ఆమె గ్లామర్ షూట్స్ చెయ్యక తప్పడం లేదు.
పైగా సమంతకి ఫోటోషూట్స్ అంటే మక్కువ ఎక్కువ. ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేసి ఆమె మిలియన్ల కొద్దీ ఫాలోవర్లుని సంపాదించుకొంది ఇన్ స్టాగ్రామ్ వేదికపై.
Also check: Samantha in a stylish outfit