ఎప్పుడూ అవే ఫొటోలే చూస్తున్న సమంత

- Advertisement -


సమంతకి కుక్కలు అంటే చాలా ఇష్టం. ఆమె ఇప్పటికే ఒక పెంపుడు కుక్కను పెంచుకుంటోంది. ఐతే, ఇప్పుడు రోజంతా పెట్ డాగ్స్ కి సంబంధించిన ఫోటోలే చూస్తోందట. అదే ఆమెకి కాలక్షేపంగా మారినట్లు కనిపిస్తోంది.

“ప్రతిరోజూ దినమంతా పప్పి వీడియోలు వెతకడమే… అడిక్షన్ అయింది…” అంటూ ఒక వీడియో షేర్ చేసింది సమంత. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ వీడియోని పెట్టింది. ఒక తమిళ చిత్రం షూటింగ్ కి వెళ్తూ ఈ వీడియో పోస్ట్ చేసినట్లు కనిపిస్తోంది. ఆమె మేకప్ వేసుకొని కారులో కూర్చొంది.

సమంత ఇప్పటికే ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసింది. ఈ తమిళ సినిమా కూడా పూర్తి చేస్తే ఆమె ఒప్పుకున్న అన్ని సినిమాలు పూర్తి అయినట్లే.

ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఆమె ఇంతవరకు స్పందించలేదు.

 

More

Related Stories