విజయ్ సేతుపతికి సమంత ఫిదా

సమంత ఈ మధ్య అందరినీ పొగిడే కార్యక్రమం పెట్టుకొంది. ఏదైనా మంచి సినిమా చూస్తే… ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేస్తోంది. అలాగే, తాను వర్క్ చేస్తున్న సినిమాకి చెందిన మూవీ మేకర్స్ ని, నటీనటుల్ని కూడా తెగ పొగుడుతోంది.

సమంత ప్రస్తుతం ఒక తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో హీరో..విజయ్ సేతుపతి. ఒక హీరోయిన్ నయనతార. మరో హీరోయిన్ గా సమంత నటిస్తోంది. నయనతార బాయ్ఫ్రెండ్ ఈ సినిమాకి దర్శకుడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. లేటెస్ట్ గా విజయ్ సేతుపతిని, నయనతారని తెగ పొగిడేస్తూ ఒక పోస్ట్ పెట్టింది ఇన్ స్టాగ్రామ్ లో.

“మైటీ స్టార్ విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. సినిమా షూటింగ్ ఇంకా మధ్యలోనే ఉంది. కానీ గ్యారెంటీగా చెప్పగలను ఇది అదరగొడుతుంది అని, ” అంటూ పోస్ట్ చేసింది.

సమంత, విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇది. తన నటనతో అదరగొట్టే విజయ్ సేతుపతితో నటించేందుకు హీరోయిన్లు ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు.

More

Related Stories