ఈ ఇడ్లీ మంచిదంటున్న సమంత

Upasana and Samantha

ఇడ్లీ మన సౌత్ ఇండియన్ ఫుడ్ లో ఒక మెయిన్ పార్ట్. ఐతే, మన సెలబ్రిటీలకు అలా తింటే నచ్చదు కదా. ఎదో ఒక ఫారిన్ ఐటెం కలిపి ఇది హెల్తీ అని చెప్తుంటారు. మొన్నటి వరకు నాకు అస్సలు వంట రాదని చెప్పిన సమంత ఇప్పుడు హెల్తీ రెసిపీలు అంటూ ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్న వంటకాల్ని తన స్టైల్ లో చెప్తోంది. సెలబ్రిటీ కదా… ఏమి చెప్పినా జనం చూస్తారు. ఓట్స్, కారెట్స్ కలిపి ఇడ్లి చేసుకుంటే హెల్తీ అంటూ న్యూట్రిషనిస్ట్ లెవెల్లో చెప్తోంది సమంత.

యువర్ లైఫ్ అంటూ ఉపాసన మొదలు పెట్టిన ఒక లైఫ్ స్టైల్ ఫ్లాట్ ఫార్మ్ కోసం సమంత చెఫ్ గా మారింది. ఈ వారం ఆమె ఓట్స్ క్యారెట్ ఇడ్లీ చేసింది. మూములు ఇడ్లీల్లో కార్బొహైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది పూర్తి పోషకాలను ఇవ్వదు. ఓట్స్, క్యారెట్ చేర్చడం వల్ల ఆ ఇడ్లీ న్యూట్రీషియస్ గా మారిపోతుందట.

తను వారంలో రెండు మూడు సార్లైనా ఇడ్లీ అల్పాహారంగా తీసుకుంటానని చెప్పింది.

Related Stories