ఆధ్యాత్మిక బాటలో సమంత, రకుల్


అనుష్క, సమంత, లక్ష్మి మంచు… పలువురు తెలుగు హీరోయిన్లకి భక్తి ఎక్కువే. సమంత రెగ్యులర్ గా తిరుపతికి వెళ్తుంది. రకుల్ కూడా వీరి గ్యాంగ్ లో చేరింది. శివరాత్రి పురస్కరించుకొని కోయంబత్తూర్ వెళ్లారు సమంత, రకుల్, లక్ష్మి మంచు, శిల్పా రెడ్డి. ఇషా ఫౌండేషన్ జగ్గీ వాసుదేవ్ నిర్వహించే శివరాత్రి ఉత్సవాల్లో వీరంతా పాల్గొన్నారు.

సమంతకి పెళ్ళైన తర్వాత భక్తి పెరిగింది. పుట్టింది క్రిస్టియన్ గానే కానీ ఆమె నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత హిందువుగా మారి పూజలు చేస్తోంది. సమంత ఈ నెలలో ‘శాకుంతలం’ షూటింగ్ మొదలు పెడుతుంది.

లక్ష్మి మంచు కొన్నాళ్లుగా గుళ్ళు,గోపురాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తోంది. రకుల్ ప్రీతి సింగ్ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ యమా బిజీగా ఉంది. వీళ్లంతా మంచి ఫ్రెండ్స్. దానికి తోడు ఆధ్యాత్మిక బంధం కూడా అల్లుకొంది ఇప్పుడు.

More

Related Stories