
“తగ్గేదే లే” అనేది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్. కానీ, నిజ జీవితంలో అది అచ్ఛంగా సమంతకి సరిపోతుంది. నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఒక నెల రోజులు మౌనంగా ఉంది. ఆ తర్వాత ఆమె తన కెరీర్ ని, జీవితాన్ని తనకి నచ్చిన రీతిలో మలుచుకుంటోంది.
ఇంతకుముందు సినిమాల్లో ఓవర్ గా ఎక్స్ పోజింగ్ చేసేది కాదు సమంత. ఇప్పుడు దానికి రివర్స్ లో వెళ్తోంది. తాను ఎవరికీ జవాబు చెప్పాల్సిన పని లేదు అన్నట్లుగా ఉంది ఆమె ఆటిట్యూడ్. “ఊ అంటావా ఊ ఊ అంటావా” పాటలో ఆమె ఎలాంటి భంగిమల్లో కనిపించిందో చెప్పక్కర్లేదు. రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. ఇప్పుడు బికినీ ఫోటోలను కూడా షేర్ చేస్తోంది.
ఇంతకుముందు ట్విట్టర్ లో అలాంటి ఫోటోలను పెట్టేది కాదు. ఇప్పుడు సబ్ చల్తా అన్నట్టు షేర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ గోవాలో ఉంది. గోవాలో స్విమ్మింగ్ పూల్ లో జలకాలాటలాడుతూ ఫోటోని తీసుకొంది. ఆ ఫోటోని షేర్ చేసింది.
సమంత మరో ఇద్దరి పెద్ద హీరోల సరసన కూడా నటించే అవకాశం ఉంది. వారు మళ్ళీ ఆమెకి హీరోయిన్ గా ఆఫర్స్ ఇస్తామని చెప్పారట.