
సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీతో పాటు మంచి కాంటాక్టులు కూడా ఉండాలి. ముఖ్యంగా హీరోలు, దర్శకులు, నిర్మాతలని ఇన్ ఫ్లుయెన్స్ చెయ్యగలిగే పవర్ ఉండాలి. సమంత ఇప్పుడు మళ్ళీ పెద్ద సినిమాలు అందుకుంటోంది అంటే అదే కారణం.
భర్త నాగ చైతన్యతో విడిపోయాక అల్లు అర్జున్, సుకుమార్ తో ఉన్న స్నేహంతో ‘పుష్ప’ సినిమాలో అవకాశం పొందింది సమంత. ఆ సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ బాగా ప్రజాదరణ పొందింది. ఆ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇప్పుడు అదే సంస్థ విజయ్ దేవరకొండతో నిర్మించే సినిమాలో హీరోయిన్ గా నటించే ఆఫర్ ని కొట్టేసింది సమంత.
విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో ఒక సినిమా త్వరలోనే మొదలుకానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ వంటి బాలీవుడ్ భామలని తీసుకోవాలనుకున్నారు. కానీ ఫైనల్ గా సమంత వద్దకు చేరుకొంది ఆ ప్రాజెక్ట్. ఆమె కాంటాక్ట్స్, ఆమె పాపులారిటీ ఇక్కడ పని చేశాయని చెప్పొచ్చు.
ఈ సినిమాకి ఆమె మూడు కోట్లు పొందనుందని అనే వార్త ఒక బస్సు. అందులో నిజం లేదు.