ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న సమంత!

- Advertisement -
Samantha

సమంత ఒక్కసారిగా యాక్టివిటీ తగ్గించడం, ఇన్ స్టాగ్రామ్ కి దూరంగా ఉండడం అనేక రూమర్లకు కారణమైంది. శివ నిర్వాణ తీస్తున్న ‘ఖుషి’ సినిమా షూటింగ్ లో జులై చివరి వారంలో పాల్గొంది. ఆ తర్వాత ఆమె పూర్తిగా ఇంటిపట్టునే ఉంటోంది. దాంతో, కొన్ని మీడియా సంస్థలు రకరకాలుగా హడావిడి చేస్తున్నాయి.

“సమంతకి ఏమీ కాలేదు. త్వరలోనే సమంత వీటిపై స్పందిస్తుంది,” అని సమంత టీం తెలుగుసినిమా కామ్ కి చెప్పింది.

ఒకప్పుడు పొద్దున లేస్తే ఇన్ స్టాగ్రామ్ లో ఎదో ఒక అప్డేట్ చేసేది సమంత. అలాంటి సమంత పూర్తిగా మౌనం వహించడంతో జనం మాట్లాడుకోవడం తప్పు లేదు. సెలెబ్రిటీలపై పుకార్లు కూడా సహజం. ముఖ్యంగా సమంతలాంటి పెద్ద హీరోయిన్ కి ఇవి తప్పవు. ప్రస్తుతానికి ఐతే ఆమె సైలెంట్ గా ఇంట్లోనే ఉంటోంది.

ఆమె నటిస్తున్న ‘ఖుషి’, ‘సిటాడెల్ ‘ (హిందీ వెబ్ సిరీస్) షూటింగ్ లు త్వరలోనే మళ్ళీ మొదలవుతాయి.

 

More

Related Stories