సమంత కొన్ని వదిలేస్తుందట

Samantha


‘పుష్ప’ విడుదలైన తర్వాత సమంతకి క్రేజ్ పెరిగింది. ఆ సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ హిందీలో బాగా ఫేమస్ అయింది. దాంతో, ఆమెకి హిందీ నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి.

‘సిటాడెల్’ అనే ఒక హిందీ వెబ్ సిరీస్ తో పాటు ఒక బాలీవుడ్ మూవీ అఫర్ కూడా దక్కింది. ఐతే, వీటి షూటింగ్స్ ఇప్పటివరకు మొదలుకాలేదు. మరోవైపు, ఆమె వింత వ్యాధితో బాధపడుతున్నారు. ఇది పూర్తిగా తగ్గడానికి మరో మూడు, నాలుగు నెలలు పడుతుందని అంటున్నారు. దాంతో, ఆమెతో సినిమా చేద్దామనుకున్న బాలీవుడ్ నిర్మాతలు ఆ ఆలోచనని విరమించుకున్నారు.

ఇక ‘సిటాడెల్’ సంగతి తెలియదు. కాకపోతే, ఈ వెబ్ సిరీస్ ని తీస్తున్న దర్శక ద్వయం రాజ్ – డీకే ఆమెకి క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళు ఆమె కోసం ఇంకొన్నాళ్లు వెయిట్ చేసే అవకాశం ఉంది.

సమంత తెలుగులో ‘ఖుషి’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ సగం పూర్తి అయింది. మిగతా సగం అవ్వాలంటే ఆమె రావాల్సిందే. సమంత నటించిన ‘శాకుంతలం’ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయింది. కానీ ఇంకా విడుదల తేదీ ఫిక్స్ కాలేదు. తెలుగు, తమిళ్ భాషల్లో మరో మూడు సినిమాలు ఒప్పుకోవాలని అనుకొంది. చర్చలు కూడా పూర్తి చేసింది. కానీ వాటిని ఆమె ఇప్పుడు వదులుకుంటుందట.

Advertisement
 

More

Related Stories