మీడియా ముందుకొస్తోన్న సమంత

- Advertisement -
Samantha


భర్త నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. కానీ, ఆ సినిమా ప్రమోషన్ లో ఆమె పాల్గొనలేదు. ఆ సినిమా మీడియా ఇంటర్వ్యూలకు కూడా దూరంగా ఉంది.

చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన 7 నెలల తర్వాత ఆమె ఇప్పుడు మీడియా ముందుకు రానుంది. ఒక సినిమా ప్రమోషన్ కోసం సమంత బయటికి వస్తోంది. ఆమె తమిళంలో నటించిన ఒక చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. నయనతార, విజయ్ సేతుపతి, సమంత కలిసి నటించిన చిత్రం ‘కన్మణి రాంబో ఖతిజ’.

ఈ సినిమా ప్రమోషన్ ని ఇక మొదలుపెడుతున్నారు. నయనతార సాధారణంగా తన సినిమాల పబ్లిసిటి ఈవెంట్స్ కి దూరంగా ఉంటుంది. కానీ, ఈ సినిమాని ఆమె ప్రమోట్ చెయ్యకతప్పదు. ఎందుకంటే, ఆమె కాబోయే భర్త విగ్నేష్ శివన్ ఈ సినిమాకి దర్శకుడు. పైగా, నయనతార నిర్మాణంలో భాగస్వామి. దాంతో, ఆమె సమంతని కూడా ప్రమోషన్ ఈవెంట్స్ కోసం రావాలని కోరిందట.

సో… ఈ సినిమా కోసం సమంత మీడియా ముందుకు రానుంది.

 

More

Related Stories