ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తోందా?

సమంత త్వరలోనే తన స్కిన్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తోందని ప్రచారం మొదలైంది. ఆమె హెల్త్ గురించి ఇప్పటికే చాలా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఐతే, ఇప్పటివరకు సమంత వీటి గురించి నోరు విప్పలేదు. అలాగనీ, తోసిపుచ్చనూ లేదు.

ఇప్పుడు వినిపిస్తున్న పుకారు ఏంటంటే… ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లి అక్కడ నయం చేసుకొని రావాలని అనుకుంటోందట. ఒక నెల రోజులు అక్కడే మకాం వస్తుందని టాక్.

ఐతే, తాజాగా ఆమె మరో బ్రాండ్ అంగీకరించింది. ఆ బ్రాండ్ కి సంబంధించిన ప్రకటనని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు ఆమె అభిమానులు. దాంతో, సమంత హెల్త్ విషయంలో, ఆమె మౌనం వహించడంతో గందరగోళం నెలకొంది.

ప్రస్తుతానికి ఐతే ఆమె ఏ షూటింగ్ లో పాల్గొనడం లేదనేది నిజం. ఆమె వల్లే విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న ‘ఖుషి’ సినిమా షూటింగ్ ఆగిపోయింది అనేది వాస్తవం.

 

More

Related Stories