శ్రీదేవి లుక్ లో సమంత!

Samantha

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ.. ‘శాకుంతలం’. ఈ సినిమాలో ఆశ్రమ కన్యగా కనిపించనుంది సమంత. ఆమెని చాలా అందంగా చూపించనున్నాడట గుణశేఖర్. ఇప్పటికే ఒక పాట చిత్రికరీంచారు.

“జగదేకవీరుడు అతిలోక సుందరి” సినిమాలో ‘అందాలలో మహో మహోదయం… ‘ అనే పాటలో శ్రీదేవి…. ఎంత అందంగా, సెన్సయూస్ గా కనిపిస్తోందో … ఆ రేంజులో సమంత దర్శనమిస్తుందట. నీతా లుల్లా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్, అశోక్ వేసిన సెట్ అదిరిపోయాయి అని అంటున్నారు.

33 ఏళ్ల సమంతని ఈ పాత్రకి తీసుకున్నప్పుడు కామెంట్స్ వినిపించాయి. ఐతే, రీసెంట్ గా పాట చూసినవాళ్లు మాత్రం సమంత అదిరిపోయిందని చెప్తున్నారు. సమంత ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న మూవీ ఇదే.

More

Related Stories