సమంత చేతుల మీదుగా!

Sai Pallavi

సాయి పల్లవి పాట సమంత లాంచ్ చెయ్యనుంది. సమంత భర్త నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘సారంగ దారియా’ అనే డ్యాన్స్ నంబర్ ని సమంత విడుదల చేస్తుందట. ఫిబ్రవరి 28న ఈ పాట మార్కెట్ లోకి వస్తుంది. చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇది శేఖర్ కమ్ముల తీస్తున్న లవ్ స్టోరీ. అందుకే, ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

సమంత ఇప్పటికే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఈ మూవీని ప్రమోట్ చేస్తోంది. కమ్ముల వల్ల తన యాక్టింగ్ స్టైల్ మారింది అని చైతన్య ఖుషీగా ఉన్నాడట. ఐతే, సాయి పల్లవి వంటి పవర్ హౌజ్ పెరఫార్మర్ ముందు చైతన్య ఎలా ఇంప్రెస్ చేస్తాడు అనేది చూడాలి.

More

Related Stories