సమంతకి మలయాళ హీరో జోడి!

- Advertisement -
Samantha

కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ అనగానే అమాయకత్వం, కళ్ళు చెదిరే అందం కలగలసిన శకుంతల రూపం మన కళ్ల ముందు కదలాడుతుంటుంది. అడవిలో వేటకు వచ్చిన యువరాజు దుశ్యంతుడు ఆశ్రమంలో ఉన్న కన్యకని చూసి మనసు పారేసుకున్నాడు అంటే ఒక రేంజులో ఆమె అందం గురించి, ఆమె యవ్వనత్వం గురించి ఊహించుకుంటాం. అలాంటి పాత్రకు 30 ఎళ్ల సమంతని సెలెక్ట్ చెయ్యడమే ఒక విచిత్రం.

కానీ దర్శకుడు గుణశేఖర్ కల్పనాచాతుర్యం ఏంటో మనకి తెలీదు కదా. ఆయన పాయింట్ అఫ్ వ్యూ, ఆయన రాసుకున్న స్క్రిప్ట్ కి ఆమె కరెక్ట్ కాబోలు. ఐతే, ఇప్పుడు సమంత సరసన నటించే దుశ్యంతుడు ఎవరు. జనరల్ గా హీరోకి జోడి ఎవరు అని అనాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సమంతకున్న స్టార్ డం, ఆమె చుట్టూ తిరిగే ఈ కథలో హీరో ఎంతైనా “కమర్షియల్ సినిమాల్లో” హీరోయిన్ లా పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. సో.. హీరోయిన్ కి జోడి అనడమే కరెక్ట్.

మరి ఈ పాత్రకి ఎవరు నటిస్తున్నారు? ఒక మలయాళం హీరోని అడుగుతున్నట్లు టాక్. త్వరలోనే క్లారిటీ వస్తుంది.

 

More

Related Stories