బిగ్ బాస్: మామ ప్లేసులో కోడలు

Samantha

ఈ వీకెండ్ బిగ్ బాస్ లో కీలక మార్పు. మామ స్థానంలోకి కోడలు వస్తోంది. ఎస్.. నాగార్జున బదులు సమంత వ్యాఖ్యాతగా రాబోతోంది. సీజన్-4లో నాగార్జునను ఇలా రీప్లేస్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.

ప్రస్తుతం నాగార్జున మనాలీలో ఉన్నాడు. ‘వైల్డ్ డాగ్’ షూట్ లో బిజీగా ఉన్నాడు. 13వేల అడుగుల ఎత్తులో షూటింగ్. అక్కడ్నుంచి హైదరాబాద్ వచ్చి బిగ్ బాస్ షూట్ చేసే పరిస్థితిలో లేడు. అందుకే మామ కోసం, మామ స్థానంలో కోడలు సమంత రంగంలోకి దిగుతోంది.

ఇంతకుముందు సీజన్-3లో కూడా ఇలాంటి మార్పు జరిగింది. వివాహ వార్షికోత్సవం సందర్భంగా అమలతో కలిసి విదేశాలకు వెళ్లాడు నాగ్. అ టైమ్ లో నాగార్జున స్థానాన్ని రమ్యకృష్ణ భర్తీ చేసింది. తన యాంకరింగ్ తో అందరి మనసులు కొల్లగొట్టింది. ఇప్పుడు ఆ స్థానంలో సమంత రాబోతోంది.

బిగ్ బాస్ హౌజ్ లో సమంత మాయచేస్తుందని చాలామంది గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే నాగార్జున టైపులోనే, ఆమె కూడా ఎప్పుడూ నవ్వులు చిందిస్తూ కనిపిస్తుంది. కానీ టఫ్ టైమ్స్ లో ఎంత సీరియస్ గా ఉండాలో అంత సీరియస్ నెస్ మెయింటైన్ చేస్తుంది.. సరిగ్గా ఇదే క్వాలిటీ ఆమెను బిగ్ బాస్ వేదికపైకి తీసుకొస్తోంది.

Related Stories