
సమంత ప్రస్తుతం వెకేషన్ లో ఉంది. తన స్నేహితురాలు శిల్పారెడ్డి కుటుంబంతో కలిసి గోవాలో ఒక లగ్జరీ రిసార్ట్ విల్లా బుక్ చేసుకున్నారు. అక్కడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వెకేషన్ ఫోటోలను ఇప్పటికే షేర్ చేశారు సమంత.
2022 కొత్త ఏడాదికి గోవాలోనే స్వాగతం పలుకుతారట. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’ షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొంది. రెండో షెడ్యూల్ ప్లానింగ్ ఇంకా కాలేదు. సో గోవాలోనే మరో వారం స్పెండ్ చెయ్యాలని సమంత నిర్ణయించుకొంది.
2021 ఆమెకి జీవితంలో చేదు అనుభవం మిగిల్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నాగ చైతన్యతో విడిపోయింది. ఐతే, కెరీర్ మాత్రం కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు ఆమెకి జాతీయస్థాయిలో పేరు దక్కింది. ఆ క్రేజ్ ని ఉపయోగించుకొని 2022లో హీరోయిన్ గా టాప్ ప్లేస్ ని మళ్ళీ కైవసం చేసుకోవాలని అనుకుంటోంది.
2022లో ‘శాకుంతలం’ కూడా విడుదల కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది.