2021లో సమంత బిజీ బిజీ!

Samantha

2020లో సమంత ఒక్క తెలుగు సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనలేదు. అలా క్యాలెండర్ మారిందో లేదో, ఇలా తొలి సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. గుణశేఖర్ డైరెక్షన్లో రూపొందే “శాకుంతలం” సినిమాలో శకుంతలగా సమంత హీరోయిన్.

2021లో ఆమె ఒప్పుకున్న మొదటి తెలుగు సినిమా. ఇది కాకుండా… నయనతార, సమంత, విజయ్ సేతుపతిలతో విగ్నేష్ శివన్ తీస్తున్న మూవీ కూడా సెట్స్ పై ఉంది. నందిని రెడ్డి డైరెక్షన్లో కూడా ఒక సినిమా ఒప్పుకోనుందట. అంటే, కొత్త ఏడాదిలో సమంత మళ్ళీ ఫుల్లుగా బిజీ అవుతుంది అన్నమాట.

సమంత అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాల కన్నా… కాన్సెప్ట్ ఓరియెంటెడ్, హీరోయిన్ ప్రధాన చిత్రాలే ఒప్పుకునే ఆలోచనలో ఉంది. గుణశేఖర్ సినిమా సైన్ చేసింది అందుకే. అలాగే, పారితోషికం విషయంలో పట్టుదలాగానే ఉంది.

More

Related Stories