
సమంత ఇప్పుడు ఎక్కువ సినిమాలు చెయ్యడం లేదు. సెలెక్టివ్ గా మారింది. ఏడాదికి ఒకట్రెండుకి మించి చెయ్యట్లేదు. ఈ ఏడాది గుణశేఖర్ తీస్తున్న ‘శాకుంతలం’ సినిమా ఒప్పుకొంది. అంతే స్పీడ్ గా పూర్తి చేసింది. ఐదు నెలల్లో ఆమె తన షూటింగ్ భాగాన్ని పూర్తి చేసింది ‘శాకుంతలం’లో.
ఇక గతేడాది ఒప్పుకున్న నయనతార చిత్రం షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తోంది సమంత. అంటే ‘శాకుంతలం’ పూర్తి కాగానే ‘నయనం’ మొదలుపెట్టింది అన్నమాట. ఇది తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతోన్న మల్టీస్టారర్. విజయ్ సేతుపతి, నయనతార, సమంత నటిస్తున్న మూవీ ఇది. నయనతార కాబోయే భర్త విగ్నేష్ శివన్ దర్శకుడిగా రూపొందుతోన్న ఈ సినిమా ఏడాది కాలంగా షూటింగ్ లో ఉంది.
ఇప్పుడు తన భాగాన్ని పూర్తి చేసేందుకు సమంత పాండిచ్చేరి వెళ్ళింది. అంటే ఈ ఏడాది ఆమె ఈ రెండు సినిమాలు పూర్తి చేస్తోంది అన్నమాట. మరి కొత్తగా ఏ సినిమా ఒప్పుకుంటుందో చూడాలి.
‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్ తర్వాత సమంత గ్రాఫ్ మరింతగా పెరిగింది. జాతీయస్థాయిలో ఆమెకి క్రేజ్ వచ్చింది. కానీ ఎందుకో ఎక్కువ సినిమాలు ఒప్పుకోవడం లేదు.