అఖిల్ తో సమస్య లేదా!

- Advertisement -
Samantha and Akhil


సమంత నాగ చైతన్యతో విడిపోయింది. మాజీ భర్తని ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవడం లేదు. కానీ, అక్కినేని – రామానాయుడు కుటుంబానికి చెందిన ఇతర సభ్యులతో మాత్రం సఖ్యంగానే ఉంటోంది. రానా, సుశాంత్, అఖిల్ అక్కినేని, వెంకటేష్ కూతుళ్ళని ఫాలో అవుతోంది సమంత.

నిన్న మరిది అఖిల్ కి కూడా బర్త్ డే విషెస్ తెలిపి అందరిని సర్ప్రైజ్ చేసింది సమంత. ఇది వైరల్ పోస్ట్ గా మారింది.

అఖిల్ పుట్టిన రోజు (ఏప్రిల్ 8) నాడు తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. “హ్యాపీ బర్త్ డే అఖిల్. ఈ ఏడాది నువ్వు కోరుకున్నవి అని జరగాలని కోరుకుంటున్నాను. ప్రార్థిస్తున్నాను,” అంటూ అఖిల్ కి ట్యాగ్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.

సమంత, నాగ చైతన్య చాలా ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. 2017లో పెళ్లి చేసుకొన్నారు. 2021 అక్టోబర్ లో విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. వారి విడిపోవడానికి కారణం ఏంటి అనే విషయంలో రకరకాల ప్రచారాలు ఉన్నాయి.

 

More

Related Stories