
టట్టూస్ అంటే నేటి తరానికి మోజు. ప్రతి హీరోయిన్ తమ బాడీపై టట్టూలు వేయించుకొని, వాటిని ప్రదర్శిస్తూ జనంలో క్రేజ్ పెంచారు. దాంతో, ఇప్పుడు అందరూ అదే పనిలో ఉన్నారు. ప్రేమలో పడగానే ప్రతి అమ్మాయి ప్రియుడు పేరు లేదా అతని పేరులోని మొదటి అక్షరాన్ని తమ బాడీపై టట్టూగా వేయించుకుంటున్నారు.
అలాంటి పని సమంత కూడా చేసింది. ఆమె బాడీపై తన మాజీ భర్త నాగ చైతన్య పేరుతో కొన్ని టట్టూలు ఉన్నాయి. వాటి గురించి గతంలో ఆమె మీడియా ఇంటర్వ్యూలలో తెలిపింది. ఇన్ స్టాగ్రామ్ లో వాటిని పోస్ట్ చేసింది.
కానీ, ఇప్పుడు ఆమె నాగ చైతన్య నుంచి విడిపోయింది. కానీ, ఆ పచ్చబొట్టు చెరిగిపోదు కదా. వాటిని తొలగించాలంటే చాలా బాధాకరమైన వ్యయప్రయాస. ఇప్పుడు ఆమెకి జ్ఞానోదయం అయింది. అందుకే, యూత్ కి నేను ఇచ్చే సందేశం ఇదే అంటూ ఆమె తాజాగా ఒక మాట చెప్పింది.
“ఎప్పుడూ టట్టూ వేయించుకోవద్దు. అసలు ఆ ఆలోచన చేయొద్దు. ఇదే నేను కుర్రకారుకి చెప్పే మాట,” అని ఆమె అంటోంది.