
సమంత చాలాకాలంగా మయోసిటిస్ అనే సమస్యతో బాధపడుతున్నారు. దీనికారణంగానే ఆమె గత ఎనిమిది నెలలుగా షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు. కొత్తగా సినిమాలు ఒప్పుకోలేదు. ఆరోగ్యమే భాగ్యం కదా. హెల్త్ మీద ఫోకస్ పెట్టి సినిమాలకు విరామం ఇచ్చారు.
ఈ గ్యాప్ లో ఆమె అనేక దేశాలు తిరుగుతున్నారు. యోగ సాధనతో పాటు ప్రకృతి ఒడిలో ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ఆమె ఎక్కువగా విదేశాల్లో ఉన్న రిసార్ట్ లలో సేదదీరుతున్నారు. ఇదంతా ఓకె కానీ తాజాగా ఆమె షేర్ చేసిన బికినీ ఫోటోలు మాత్రం కలకలం రేపాయి.
ఆమె బికినీలో కనిపించడం ఇదే మొదటి సారి కాదు. బికినీ ఫోటోలను గతంలో కూడా ఆమె షేర్ చేసింది. ఐతే, తాజాగా షేర్ చేసిన ఫోటోలు మాత్రం రకరకాల కామెంట్స్ ని తీసుకొచ్చాయి.
సమంత వ్యవహారం చూస్తుంటే ఆమె హెల్త్ పర్ఫెక్ట్ గానే ఉందే అని ఆశ్చర్య పడుతూ కామెంట్లు పడుతున్నాయి. మరికొందరేమో అనారోగ్యం రాగానే బెంబేలు పడకుండా పాజిటివ్ దృక్పథంతో సమంత లైఫ్ ని లీడ్ చేస్తోందని ప్రశంసిస్తున్నారు. మరికొందరు, ఇంత సూపర్ ఫిగర్ పెట్టుకొని సినిమాలు చెయ్యకుండా ఎందుకు టూర్లు వేస్తున్నారు అని కామెంట్లు పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో రియాక్ట్ అయ్యారు.
ALSO READ: Samantha cools off in a bikini at a Malaysian beach resort
మొత్తమ్మీద, సమంత లేటెస్ట్ బికినీ ఫొటోలతో సోషల్ మీడియాలో ఒక రచ్చ లేపింది అనేది నిజం.