
గత కొంత కాలంగా సమంత అనేకవిధాలుగా సతమతం అవుతోంది. డివోర్స్ కావడం, ఆ తర్వాత మయోసైటిస్ అనే వ్యాధికి గురి కావడం… ఇలా ఎన్నో సమస్యలు. ఈ బాధలు ఇప్పడు తగ్గినా వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని మాట్లాడుతోంది సమంత.
మయోసైటిస్ నుంచి ఆమె కోలుకుంటోంది. దీని గురించి జనంలో అవగాహన పెంచేందుకు సమంత ‘టేక్ 20’ పేరుతో హెల్త్ పాడ్ కాస్ట్ మొదలుపెట్టారు. సమంత అడిగిన పలు ప్రశ్నలకు న్యూట్రీషనిస్ట్ అల్కేశ్ సమాధానాలిచ్చారు.
“మయోసైటిస్ అనేది వ్యాధి కాదు ఇది ఇమ్యూనిటీకి సంబంధించిన సమస్య. ఇది ఎవరికైనా ఎప్పుడైనా రావొచ్చు. ముఖ్యంగా ఇది జీవనశైలికి సంబంధించిన ఇబ్బంది. ఒత్తిడి కూడా దీనికి కారణం,” అంటూ ఆ న్యుట్రిషన్ నిపుణుడు చెప్పారు. దాంతో ఆమె తాను ఎలా మానసిక ఒత్తిడికి గురయ్యానో తెలిపింది సమంత.
మయోసైటిస్ రావడానికి సరిగ్గా ఏడాది ముందు తాను ఎంతో స్ట్రెస్ లో ఉన్నట్లు ఆమె చెప్పింది. చైతన్యతో విడాకులు తీసుకోవడం తన ఆరోగ్యంపై ప్రభావం పడింది అని ఆమె పరోక్షంగా చెప్పింది.