
నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తన కెరీర్ పై ఫోకస్ పెట్టిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో ఫోకస్ మరోసారి ఆమెపై పడింది. ఐతే, సమంత తన బాలీవుడ్ మార్కెట్, హిందీ చిత్రాలపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అక్కడ ‘బిల్డప్’ కోసం ఆమె చేసిన ఒక పని ఆమెని అడ్డంగా బుక్ చేసింది.
‘పుష్ప’ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేసినందుకు నిర్మాతలు ఏకంగా కోటిన్నర రూపాయలు చెల్లించారు. ఇది చాలా పెద్ద మొత్తం. ఆమెకి ఒక తెలుగు సినిమాకి 2 నుంచి రెండున్నర కోట్ల రూపాయలు ముడుతుంది. ఒక్క పాటకే ఏకంగా కోటిన్నర వచ్చింది. ఇది రికార్డు మొత్తమే. ఐతే, బాలీవుడ్ వాళ్ళ దృష్టిలో కోటిన్నర అంటే ‘తక్కువ’. అందుకే, అక్కడ హైప్ కోసం ఈ పాటకి 5 కోట్లు తీసుకున్నట్లు సమంత చెప్పుకొందట.
రెండు రోజులుగా బాలీవుడ్ లోని పలు మీడియా వెబ్ సైట్ లలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. అంటే, సమంత డిజిటల్ టీమ్ బాలీవుడ్ మీడియాకి ఈ సమాచారం చేరవేసింది అన్నమాట. ఆ వార్త వచ్చిన తర్వాత ఫిలింనగర్లో ఆమె గురించి జోకులు మొదలయ్యాయి. బాలీవుడ్ లో బిల్డప్ కోసం సమంత ఇలా అబద్ధాలని ప్రచారం చేసుకుంటోంది అని అందరూ నవ్వుకుంటున్నారు.
పబ్లిసిటీ కోసం చేసిన పని ఆమెని నవ్వుల పాలు చేసింది