
గుణశేఖర్ తీసిన ‘రుద్రమదేవి’ ఆయనకు కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలింది. పేరు వచ్చినా… లాభాలు రాలేదు. అలాగే, రానాతో మొదలుపెట్టిన “హిరణ్య కశ్యప” అటకెక్కింది. దాంతో ఆయన రీసెంట్ గా అనౌన్స్ చేసిన ‘శాకుంతలం’ సినిమాని సింపుల్ గా కనిచేస్తారని అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన వ్యవహారం “ప్రొడక్షన్ వాల్యూస్” విషయంలో తగ్గేది లేదన్నట్లుగానే ఉంది.
లక్కీగా, ఆయనకు హీరోయిన్ గా సమంత దొరికింది. సమంత పేరు మీద డిజిటల్, శాటిలైట్ రైట్స్ బాగా వస్తాయి. అలాగే, సినిమాకి కావాల్సిన ఖర్చు అంతా భరించేందుకు దిల్ రాజు ముందుకొచ్చారు. దిల్ రాజు లేటెస్ట్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టారు. “జెర్సీ”, “ఎఫ్ 2”, “హిట్” సినిమాలని హిందీలో దిల్ రాజు బ్యానర్లో రీమేక్ అవుతున్నాయి. సో.. “శాకుంతలం” సినిమాని ఆయన హిందీలో కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
అందుకే, గుణశేఖర్ ఖర్చు విషయంలో తన పంథాని వీడట్లేదు. కాస్ట్యూమ్స్ కోసం నీతా లుల్లాని తీసుకొచ్చారు. గ్రాఫిక్స్ విషయంలో కూడా రాజీపడబోవడం లేదు.