ఏమి రాసినా దానికే లింక్

- Advertisement -


సమంత బుక్ చదివినా, ఒక కొటేషన్ షేర్ చేసినా… ఇప్పుడు ప్రతిదీ ఆమె జీవితానికి లింక్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఆమె హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ రాసిన బోక్ నుంచి ఒక పేరాగ్రాఫ్ ని పోస్ట్ చేసింది. అందులో అతను జీవితంలో కోల్పోయిన వాటి గురించి, డివోర్స్ ఇష్యూ గురించి ఉంది. అంతే… సమంత కూడా నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఇలాగే ఫీల్ అవుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫాలోవర్స్.

సమంత, నాగ చైతన్య విడిపోయి ఆరు నెలలు కావొస్తోంది. వారి వారి జీవితాల్లో ముందడుగు వేశారు. ఇప్పుడు వాళ్ళకి డివోర్స్ అయిపోయిన ముచ్చట. కెరీర్ లో దూసుకుపోవడం గురించే ఆలోచన.

ఐతే, సమంత కూడా ప్రతిరోజూ తన గురించి జనం మాట్లాడుకోవాలని, తన గురించి బాలీవుడ్, నేషనల్ మీడియా రాయాలని తపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ఇటీవల ఎక్కువగా బాలీవుడ్ వెబ్ సైట్స్ లో ప్రచారంపై దృష్టి పెట్టింది. అక్కడ పీఆర్ ఏజెన్సీని కూడా నియమించుకొంది.

అందుకే, సమంత తుమ్మినా దగ్గినా బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చేస్తాయి.

 

More

Related Stories