సమంత ఆలోచన కూడా అదే!

- Advertisement -


ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేదు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థల రాక తర్వాత ఇండియన్, కొరియన్, జపాన్ నటీనటులకు కూడా గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ పెరిగింది. వైరల్ కంటెంట్ లో నటించిన యాక్టర్స్ కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కుతోంది.

రీసెంట్ గా ధనుష్ కి ఒక హాలీవుడ్ చిత్రంలో అవకాశం వచ్చింది. లేటెస్ట్ గా అలియా భట్ హాలీవుడ్ ఆఫర్ దక్కించుకొంది. ఆమె నటించే హాలీవుడ్ చిత్రాన్ని ఈ రోజు నెట్ ఫ్లిక్స్ సంస్థ అనౌన్స్ చేసింది.

సమంత కూడా హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల కోసమే ప్రయత్నిస్తోంది. ఆమె నటించిన ‘పుష్ప’ సాంగ్ యూట్యూబ్ లో మూడు, నాలుగు వారల పాటు గ్లోబల్ లెవల్లో మొదటి స్థానంలో నిచ్చింది. “ఊ ఊఊ అంటావా మావా” అనే పాట తర్వాత ఆమె చూపు హాలీవుడ్ కంటెంట్ పై పడింది అని టాక్.

ఇప్పటికే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రతినిధులకు అలాంటి ఆఫర్లు ఉంటే తనకి ఇవ్వాల్సిందిగా కోరిందట. మార్కెట్ ఎంత పెరిగితే పారితోషికం అంత అధికం అవుతుంది. అలాగే, ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. తద్వారా యాడ్స్, బ్రాండ్స్ కూడా మరింతగా యాడ్ అవుతాయి. సో, ఆదాయం ఆటోమేటిగ్గా పెరుగుతుంది. అందుకే, ఆమె అంతర్జాతీయ వెబ్ సిరీస్ కానీ, ఫిలిం కానీ చేసే ఆలోచనలో ఉందట.

 

More

Related Stories