
సమంత నటించిన మొదటి వెబ్ సిరీస్ జూన్ 4 న విడుదల కానుంది. ఆమె నటించిన ఆ సిరీస్… ‘ది ఫ్యామిలీ మేన్ 2’. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా స్ట్రీమ్ కానుంది. మనోజ్ బాజ్ పేయ్ హీరోగా నటించిన థ్రిల్లర్ ఇది. ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయింది.
సమంత రాజి అనే టెర్రరిస్ట్ పాత్ర పోషించడం విశేషం. ఈ రెండో సీజన్ కథ చెన్నైలో జరుగుతుంది. సమంత తమిళ టెర్రరిస్ట్ గా కనిపిస్తోంది. తమిళ్ లో తానే డబ్బింగ్ చెప్పుకొంది సమంత. ఆమె ఇందులో చాలా డేరింగ్ సీన్లు చేసిందట.
‘ది ఫ్యామిలీ మేన్ 2’ సిరీస్ కి మంచి పేరు, తన పాత్రకి క్రేజ్ వస్తే మరిన్ని వెబ్ సిరీస్ లు, డ్రామాలు చేయాలనుకుంటోంది సమంత. తెలుగులో కూడా చేస్తుందట. ఇప్పటికే ఒక ఒటిటి ఫ్లాట్ ఫామ్ కోసం టాక్ షో చేసింది. కానీ దానికి క్రేజ్ రాలేదు. దాంతో సీజన్ లో చెయ్యాలనుకున్న ఎపిసోడులన్నీ పూర్తికాకముందే ఆపేశారు. మరి ఈ వెబ్ సిరీస్ సమంతకి నేషనల్ లెవల్లో క్రేజ్ తెస్తుందా?
మనోజ్ బాజ్ పేయ్ కి భార్యగా ప్రియమణి నటిస్తోంది ఇందులో.