సమంత ట్రీట్మెంట్ అయిపోయిందా?

Samantha


సమంత ప్రస్తుతం అమెరికాలో ఉంది. ఈ నెలలోనే ఆమె ఇండియాకి తిరిగి రానుంది. సమంత అమెరికా ట్రిప్పు గురించి రకరకాల ఊహాగానాలున్నాయి. ఆమెకి స్కిన్ ఎలర్జీ సమస్య ఉందని, ఇండియాలో ట్రీట్మెంట్ చేయించుకున్నా తగ్గలేదనేది ఒక వార్త. మంచి
ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిందనేది మరో వార్త.

యూట్యూబ్ ఛానెల్లో, వెబ్ సైట్ లలో ఫుల్లుగా వార్తలు వచ్చాయి. దాంతో, ఏమి చెయ్యాలో తెలియక “సిటాడెల్” అనే వెబ్ సిరీస్ కోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు అమెరికాలో ఉందని ట్విట్టర్లో డబ్బులకు ట్వీట్లు వేసే ఇన్ఫ్లుఎన్సర్స్ తో రాయించింది సమంత.

కారణమేదైనా, సమంత అమెరికా వెళ్ళింది నిజం. అనారోగ్య కారణాల వల్లే షూటింగ్ కి రాలేను అని తన సినిమాల నిర్మాతలకు సమంత చెప్పిన మాట నిజం. ట్రీట్మెంట్ అయిందా లేదా అన్నది తెలియదు.

సమంత ఈ నెలలో ఇండియాకి వచ్చి నెలాఖరు నుంచి కానీ, వచ్చే నెల నుంచి కానీ షూటింగ్ లో పాల్గొంటుందిట. విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ అనే సినిమాలో ఆమె నటిస్తోంది. ఆమె వల్లే షూటింగ్ ఆగింది.

 

More

Related Stories