బేబీ బయటికి రానంటోంది!

Samantha Akkineni

పెళ్లి కాని హీరోయిన్లకు ఎప్పుడూ తగిలే ప్రశ్న… పెళ్ళెప్పుడు అని. పెళ్లి అయిన భామలు ఎదుర్కునే ప్రశ్నలు… రూమర్లు.. మీరు ప్రెగ్నెంటా అని. మూడేళ్ళ క్రితం నాగ చైతన్యని పెళ్లాడిన సమంత పరిస్థితి ఇదే. మూడేళ్ళుగా ఆమె గర్భవతి అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. లేటెస్ట్ గా అభిమానులు కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు ఆమెని.

ఇటీవల ఇన్ స్టాగ్రామ్ చాటింగ్ లో అభిమాని ఇదే ప్రశ్న అడిగితే … సమంత ఫన్నీగా సమాధానం ఇచ్చింది. “ఏమి చెయ్యమంటారు… నా బేబీ మూడేళ్ళ నుంచి కడుపులోనుంచి బయటికి రావడం లేదు,” అని కొంటెగా రిప్లై ఇచ్చింది.

అంటే మూడేళ్లుగా తాను “ప్రెగ్నెంట్” అనే వార్తలు పుట్టిస్తున్నారు అని అర్థం వచ్చేలా మాట్లాడింది. ఈ ఏడాది ఆమె ఇంతవరకు ఏ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదు. పూర్తిగా గృహిణిగానే జీవితాన్ని గడుపుతోంది. దాంతో ఆమె తల్లి కాబోతుంది కాబోలు అన్న వార్తలు సాగుతున్నాయి.

Related Stories