కోపరేట్ చేయలేదని కట్ చేశారు

బాలీవుడ్ లో జరుగుతున్న నెపొటిజం చర్చలోకి ఒకప్పటి హీరోయిన్ సమీరారెడ్డి కూడా చేరిపోయింది. బాలీవుడ్ లో తనకు జరిగిన కాస్టింగ్ కౌచ్ అనుభవాలతో పాటు నెపొటిజం వల్ల తను ఎదుర్కొన్న కష్టాల్ని ఓపెన్ గా బయటపెట్టేసింది ఈ బ్యూటీ.

“అంతా ఓకే అనుకున్న తర్వాత సినిమా నుంచి నన్ను తొలిగించేవారు. అడిగితే ఆ క్యారెక్టర్ కు నువ్వు సెట్ అవ్వవు అనేవారు. ఆ తర్వాత ఆ పాత్రను స్టార్ కిడ్ కు ఇచ్చేవారు.”

ఇలా బాలీవుడ్ లో తనకు 3 భారీ ఆఫర్లు మిస్ అయ్యాయని బాధగా చెప్పుకొచ్చింది సమీరారెడ్డి. అంతేకాదు.. కాస్టింగ్ కౌచ్ ఘటనలపై కూడా నోరువిప్పింది. హీరోలకు ఫేవర్ చేయడం లేదని, ”ఫన్” అందించడం లేదని తనను కొన్ని సినిమాల నుంచి తప్పించిన విషయాన్ని బయటపెట్టింది.

“ఓ హీరో నేరుగా నా దగ్గరకొచ్చి నిన్ను సంప్రదించడం కష్టంగా ఉంది. నీతో ఫన్ ఉండడం లేదన్నాడు. ఇకపై నీతో సినిమాలు చేయనని నా మొహం మీదే చెప్పాడు. అలాగే ఆ హీరో సరసన మళ్లీ నాకు ఛాన్స్ రాలేదు.”

తనకు చెప్పకుండా కొన్ని సినిమాల్లో ముద్దు సీన్లు కూడా పెట్టారని, చేయకపోతే రీప్లేస్ చేస్తామంటూ బెదిరించారనే విషయాల్ని సమీరా బయటపెట్టింది. సమీరారెడ్డి వ్యాఖ్యలతో బాలీవుడ్ లో నెపొటిజంపై చర్చ మరింత ఊపందుకుంది.

Related Stories