క్వారంటైన్లోకి వెళ్లిన సంపత్

Sampath Raj

షూటింగ్ లు మొదలుకావడంతో టాలీవుడ్ లో కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. కొందరు పార్టీలు చేసుకొని కరోనా తెచ్చుకుంటున్నారు. మరి కొందరు షూటింగ్ లకి వెళ్లి కరోనా బారిన పడుతున్నారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. లేటెస్ట్ గా విలన్ గా, తండ్రిగా నటించే సంపత్ రాజ్ కి కూడా కరోనా సోకింది.

సంపత్ కూడా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళాడు. ఆయన చెయ్యాల్సిన సినిమా షూటింగ్ ల షెడ్యూల్స్ మార్పులు జరుగుతున్నాయి. అందులో రెండు బడా తెలుగు సినిమాలున్నాయి.

రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, నాగబాబు, రాజశేఖర్, దానయ్య, తమన్న, రకుల్ ప్రీత్ సింగ్…. ఇలా టాలీవుడ్ సెలెబ్రిటీలు పలువురు కరోనా బారిన పడ్డారు. అందులో దాదాపుగా అందరూ సింపుల్ గానే కోలుకున్నారు.

More

Related Stories