“బ్రో” నా బెస్ట్ మూవీ: సముద్రఖని

- Advertisement -
Samuthirakani

సముద్రఖని తెలుగులో నటుడిగా చాలా పాపులర్. ఐతే, ఆయన తమిళంలో పేరొందిన దర్శకుడు. ఇప్పటికే 14 చిత్రాలు తీశారు తమిళంలో. ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజలతో “బ్రో” సినిమాని డైరెక్ట్ చేశారు సముద్రఖని. జూలై 28న విడుదల కానున్న ఈ సినిమా గురించి మాట్లాడిన సముద్రఖని తన కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీ అని అంటున్నారు.

“1994 లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేశా. 14 సినిమాలు డైరెక్ట్ చేశాను. దర్శకుడిగా ‘బ్రో’ నా 15వ చిత్రం. నేను తమిళంలో తీసిన “వినోదయ సితమ్” చూసిన పవన్ కళ్యాణ్ నన్ను మెచ్చుకున్నారు. త్రివిక్రమ్ అన్నయ్యకి ఆ సినిమా చివర్లో వచ్చే సంభాషణలు బాగా నచ్చాయి. తెలుగులో పవన్ కళ్యాణ్ గారితో చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ గారు సజెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో కొన్ని మార్పులతో చేస్తే బాగుంటుందని ఆయనే చెప్పారు. అలా “బ్రో” మొదలైంది,” అని సముద్రఖని తెలిపారు.

తమిళంలో తీసిన కథలోని ఆత్మని తీసుకొని పవన్ కళ్యాణ్ గారి స్టార్డంకి తగ్గట్లుగా మార్పులు చేసారంట. అయినా, తమిళంలో కన్నా తెలుగులోనే ఇంకా బాగుంటుంది అని ఆయన అంటున్నారు.

త్రివిక్రమ్ లేకుంటే ఈ సినిమా రూపొందకపోయేది. “నిజమే త్రివిక్రమ్ అన్నయ్య నాకు ఒక తండ్రిలా అండగా నిలబడ్డారు,” అని సముద్రఖని అన్నారు.

పవన్ కళ్యాణ్ కి రెండు రోజుల్లోనే స్టయిల్ అర్థమైంది. ఒక్క రోజు కూడా మేం షూటింగ్ లో టైం వేస్ట్ చెయ్యలేదు. పవన్ కళ్యాణ్ కున్న బిజీ పొలిటికల్ షెడ్యూల్ తెలుసు. అలాగే ప్లాన్ చేసుకున్నాం. అంతే కాదు, ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ఆయన ఉపవాసం ఉన్నారు. ఎంతో నిష్ఠతో పనిచేశారు,” అని పవన్ కళ్యాణ్ తో పనిచేసిన అనుభూతులను సముద్రఖని వివరించారు.

 

More

Related Stories