నిజంగా ఆమెది గోల్డెన్ లెగ్గా?

మహా అందెగత్తె కాదు. గొప్ప నటి కాదు. ఒక రెగ్యులర్ హీరోయిన్లకుండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఐతే, ఆమె సక్సెస్ రేట్ మాత్రం సూపర్. అందుకే, ఆమెది గోల్డెన్ లెగ్ అని హీరోలు కూడా అంటున్నారు.

సంయుక్త తెలుగులో ఇప్పటివరకు నటించిన చిత్రాలన్నీ హిట్టే. అందులో ఆమె పాత్రలు చిన్నవా పెద్దవా అనేది పక్కన పెడితే నటించిన సినిమాలు ఆడాయి. “నిజంగా ఆమె సూపర్. లక్కీ హ్యాండ్. ఆ లక్కు నాకు కూడా కలిసి వస్తుంది అనుకుంటున్నాను,” అని సాయి ధరమ్ తేజ్ ఆమె గురించి పొగిడారు.

వీళ్లిద్దరు జంటగా ‘విరూపాక్ష’ చిత్రంలో నటించారు. అది ఈ శుక్రవారం విడుదల అవుతోంది.

ఈ కేరళ కుట్టి నటించిన తెలుగు చిత్రాలు… ‘భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘సార్’. ఇందులో ఒక్క ‘సార్’ చిత్రంలోనే ఆమెకి చెప్పుకోదగ్గ పాత్ర దక్కింది. మిగతా రెండింటిలో ఆమె ఉందంటే ఉంది. ఐతే, ఇక్కడ సక్సెస్ కౌంట్ అవుతుంది కాబట్టి ఈ భామకి అలా గోల్డెన్ లెగ్గు అన్న ఇమేజ్ వచ్చేలా ఉంది.

తమిళ్, మలయాళ చిత్రాలు చాలానే చేసింది. 2018 నుంచి హీరోయిన్ గా నటిస్తోంది. కానీ ఆమెకి క్రేజ్ వచ్చింది మాత్రం తెలుగు చిత్రాలతో. త్వరలో ‘డెవిల్’ అనే చిత్రంలో కూడా కనిపించనుంది. ఇందులో మరోసారి కళ్యాణ్ రామ్ సరసన నటిస్తోంది.

ALSO CHECK: Samyuktha at Virupaksha promotions

 

More

Related Stories