
సంయుక్త మీనన్ కి తెలుగులో హిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆమె తెలుగులో నటించిన చిత్రాల్లో 90 శాతం విజయం సాధించడం విశేషం. అందుకే ఆమెకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
తాజాగా ఆమె శర్వానంద్ సరసన ఒక కొత్త సినిమా సైన్ చేసింది. 2024లో ఆమె ఒప్పుకున్న మొదటి
చిత్రం.
ఇటీవల ఆమె సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతుందని ప్రచారం జరిగింది. ఎందుకంటే ఆమె తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉంది అనేది టాక్. పెళ్లి చేసుకుంటే సినిమాలకు ఫుల్ స్టాప్ పడుతుంది అని భావించారు. కానీ పెళ్లి సంగతి ఏమో కానీ ఆమె కొత్తగా మళ్ళీ సినిమాలు ఒప్పుకుంటోంది.
బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న మాట వాస్తవమేనంట. కానీ అది ఈ ఏడాది జరుగుతుందా లేదా వచ్చే ఏడాదినా అనేది చూడాలి.
ప్రస్తుతం ఆమె ఒప్పుకుంటున్న తీరుని బట్టి చూస్తుంటే కెరీర్ ని ఇప్పట్లో వదులుకునే ఆలోచనలో ఆమె లేదు.

పైగా ఆమె తెలుగులో తప్ప మరో భాషలో సినిమాలు ఒప్పుకోవడం లేదు. మాతృభాష మలయాళంలో కూడా సంయుక్తకు పెద్దగా ఆఫర్లు లేవు. కానీ తెలుగులో ఆమెకి మంచి సక్సెస్ రేట్ ఉంది. దాంతో ఆమెని అవకాశాలు వరిస్తున్నాయి ఇక్కడ.