అనుకున్నంత జోరు లేదు!


హీరోయిన్ సంయుక్తకి గోల్డెన్ లెగ్ అన్న ఇమేజ్ వచ్చింది. ఎందుకంటే ఆమె పట్టిందల్లా బంగారమే. ఆమె నటించిన నాలుగు చిత్రాలు సూపర్ హిట్. తాజాగా విడుదలైన ‘విరూపాక్ష’ కూడా బాగా ఆడుతోంది. ఆమె ఖాతాలో ఇది మరో బ్లాక్ బస్టర్.

ఇలా 100 శాతం విజయాలు అందుకున్న హీరోయిన్ కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎందుకనో ఆమెకి ఆఫర్లు అనుకున్నంతగా రావట్లేదు. ఇప్పుడు ఆమె చేతిలో కేవలం ఒకటే మూవీ ఉంది. ఇంకా కొత్తగా ఏది సైన్ చెయ్యలేదు. అనౌన్స్ చెయ్యలేదు.

శ్రీలీల నటించిన ‘పెళ్లి సందD’ హిట్ కాగానే నాలుగు సినిమాలు ఆమె వల్లో వాలాయి. ‘ధమాకా’ హిట్ కాగానే మరో మూడు. క్రేజ్ అంటే అది. కానీ, సంయుక్తకి అలా జరగలేదు. గోల్డెన్ లెగ్గు అని పిలుస్తున్నారు కానీ పిలిచి ఆఫర్లు ఇవ్వట్లేదట.

సంయుక్త కొంచెం ఎక్కువ రేట్ కోట్ చేస్తోంది అనేది ఒక కామెంట్. అలాగే, సినిమా ఒప్పుకున్న తర్వాత ఆమె మరిన్ని డిమాండ్స్ చేస్తోందట. అందుకే, కాబోలు నిర్మాతలు ఎగబడి ఆమెని సైన్ చెయ్యడం లేదు.

ఇది కూడా చదవండి: Samyuktha, The Golden Leg

 

More

Related Stories