వాళ్ళకి కామన్ సెన్స్ లేదు: వంగా

Sandeep Reddy Vanga


దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన “యానిమల్” చిత్రం విడుదలై ఇప్పటికే రెండు నెలలు అయింది. అయినా ఈ సినిమాపై విమర్శలు ఆగడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి. సెలెబ్రిటీలు సినిమాని తిడుతున్నారు. దాంతో, దర్శకుడు సందీప్ వంగా గట్టిగా సమాధానం ఇస్తున్నారు.

Advertisement

“సాధారణ ప్రేక్షకుడు ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోను. ఎందుకంటే వాళ్లకు తెలిసిన కోణంలో వాళ్ళు అభిప్రాయం చెప్తారు. అందులో తప్పేమీ లేదు. కానీ సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్లు అడ్డదిడ్డంగా విమర్శలు చేస్తే కోపం వస్తుంది. సినిమా మేకింగ్ గురించి, సినిమా కథల గురించి అవగాహన ఉన్నవాళ్లు ఎవరూ ఇలాంటి పిచ్చి విమర్శలు చెయ్యరు. బాలీవుడ్ లో చాలామందికి కామన్ సెన్స్ కూడా లేదని అర్థమవుతోంది,” అని ఘాటుగా స్పందించారు సందీప్.

“యానిమల్” సినిమా ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. దాంతో, థియేటర్లో చూడని చాలామంది ఇప్పుడు చూశారు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు మరీ అతిగా ఉన్నాయి అనేది అందరి మాట. మరీ ఆడవాళ్ళని అలా చూపించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఐతే, ఇలాంటి కామెంట్స్ తో, విమర్శలతో నాకు ఎలాంటి పేచి లేదని సందీప్ క్లారిటీ ఇచ్చారు. జనం అభిప్రాయాలను గౌరవిస్తాను కానీ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటులు, నటీమణులు, ఫిలింమేకర్స్ సినిమా చూసి వాంతి చేసుకున్నాం, ఇలాంటివి చేస్తే జనం ఖరాబు అవతారు వంటి పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తుంటే చిరాకు వేస్తోంది అని సందీప్ అంటున్నారు.

“యానిమల్” సినిమా విడుదలకు ముందే సినిమా ఇండస్ట్రీలోని కొందరి నుంచి ఇలాంటి మాటలు వస్తాయని తాను ఊహించినట్లు చెప్తున్నారు సందీప్. ఐతే, సినిమా కళ్ళు చెదిరే హిట్ కావడంతో కొందరు ఇప్పుడు సైలెంట్ అయ్యారు అనేది సందీప్ మాట.

Animal Teaser

“సినిమా ఆడకపోయినా లేదా సాధారణ హిట్ అయినా వాళ్ళు ఇంకా ఎక్కువ విమర్శలు గుప్పించేవారు. దాదాపు 1000 కోట్లు కలెక్ట్ చేసేసరికి ఇప్పుడు తక్కువ మంది నోళ్లు పెగులుతున్నాయి,” అని సందీప్ చెప్పారు.

ALSO CHECK: Animal fame Tripti Dimri in a long gown

Advertisement
 

More

Related Stories