
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సందీప్ వంగ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ఆ తరువాత ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో ‘కబీర్ సింగ్’గా తీసి బాలీవుడ్ లో కలకలం రేపాడు. ఇప్పుడు మూడో సినిమాగా “యానిమల్” అని అనౌన్స్ చేశాడు. రణబీర్ కపూర్ హీరో. న్యూ ఇయర్ స్పెషల్ గా మూవీని ఒక వీడియో రూపంలో ప్రకటించాడు. ఈ వీడియోలో ఎలాంటి విజువల్ లేదు… బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్, రణబీర్ కపూర్ వాయిస్.
మ్యూజిక్ రాబట్టుకోవడంలో సందీప్ వంగ కింగ్. ఈ అనౌన్స్ మెంట్ లో వాడిన సౌండ్ అదిరిపోయింది. రణబీర్ కపూర్ కి సాలిడ్ హిట్ పడేలా ఉంది.
సందీప్ వంగ … ఈ సినిమాని హిట్ గా మలిస్తే అతనికి బాలీవుడ్ లో తిరుగుండదు. “కబీర్ సింగ్” బాలీవుడ్ మార్కెట్ లో సంచలన విజయం సాధించింది. ఐతే, అక్కడి క్రిటిక్స్ మాత్రం సినిమాపై చాలా విమర్శలు చేశారు. వారిపై కూడా రివర్స్ లో కామెంట్స్ పేల్చాడు సందీప్ వంగ.