చిన్న విమర్శ కూడా తట్టుకోలేరా?

Animal


“యానిమల్” సినిమా ఒక సంచలనం. దాదాపు 900 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమా తీసిన దర్శకుడు సందీప్ వంగా పెద్ద దర్శకుల జాబితాలోకి చేరిపోయాడు. ఇక రణబీర్ కపూర్ నిజమైన బాలీవుడ్ అగ్రహీరోగా అవతరించాడు.

ఐతే, “యానిమల్” సినిమాకి విమర్శలు కూడా ఎక్కువే వచ్చాయి. ముఖ్యంగా ఇందులో ఒక హీరోయిన్ గా నటించిన తృప్తి పోషించిన పాత్రని హీరో రణబీర్ కపూర్ పాత్ర అవమానించే తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. “నా బూట్లు నాకు,” అని హీరోయిన్ ని హీరో అనడం గురించి చాలామంది అభ్యంతరం తెలిపారు. దర్శకుడు సందీప్ వంగ ఇలాంటివి తగ్గించుకోవాలి అని అన్నారు.

ఐతే, ఈ సినిమాపై ఇప్పటివరకు ఎవరు విమర్శించినా వారిని సందీప్ వంగా, ఆయన టీం రివర్స్ విమర్శలు చేస్తోంది. సోషల్ మీడియా వేదికపై విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా బాలీవుడ్ లెజెండరీ రైటర్ జావేద్ అక్తర్ చేసిన కామెంట్లకు కూడా ఇలాగే స్పందించింది ఈ టీం.

“హీరోయిన్ ని హీరో తన బూట్లు నాకమని అనడాన్ని హీరోయిజంగా భావిస్తే ప్రమాదం” అని జావేద్ అక్తర్ తప్పు పట్టారు. దానికి స్పందించిన యానిమల్ టీం అక్తర్ ని ట్విట్టర్ వేదికపై విమర్శలు గుప్పించింది.

ఐతే ఎవరు విమర్శిచినా తట్టుకోలేకుండా సందీప్ వంగ టీం స్పందిచండం చాలా మందికి నచ్చడం లేదు. చిన్న విమర్శను కూడా తట్టుకోలేనంతగా వంగా వైఖరి ఉంది అని అంటున్నారు.

Advertisement
 

More

Related Stories