తల్లిగా సంగీత మరో మూవీ!

Sangeeta

ఒకప్పుడు హీరోయిన్ గా అదరగొట్టిన సంగీత ఇప్పుడు తల్లి పాత్రలోకి వచ్చేసింది. ఇటీవలే ఆమె రష్మిక తల్లిగా కన్పించింది. “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో “నెవ్వర్ బిఫోర్” అంటూ నవ్వించింది. ఇప్పుడు మరో సినిమాలో తల్లిగా కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె నటిస్తున్న ఈ కొత్త సినిమాకి “మసూద” అనే పేరుని ఖరారు చేశారు.

‘మ‌ళ్లీ రావా’ చిత్రంతో గౌత‌మ్ తిన్న‌నూరి, ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రంతో స్వ‌రూప్‌ ఆర్‌.ఎస్‌.జె. లాంటి డైరెక్ట‌ర్లను ప‌రిచ‌యం చేసిన స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఇప్పుడు ‘మ‌సూద‌’ మూవీతో మ‌రో ప్రామిసింగ్ డైరెక్ట‌ర్ సాయికిర‌ణ్‌ను ప‌రిచ‌యం చేస్తోంది.

హార‌ర్ డ్రామాగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో హీరోగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్ తిరువీర్ న‌టిస్తుండ‌గా, ‘గంగోత్రి’లో బాల‌న‌టిగా అల‌రించిన కావ్య క‌ల్యాణ్‌రామ్ హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సంగీత అత్యంత ముఖ్య‌మైన పాత్ర‌ను చేస్తున్నారు.

ప‌దిహేడు సంవ‌త్స‌రాల త‌న కూతురు అనూహ్యంగా ప్ర‌వ‌ర్తిస్తుండ‌టంతో ఆందోళ‌న చెందిన ఒక ఒంట‌రి త‌ల్లి అతి భ‌య‌స్తుడైన ప‌క్కింటి యువ‌కుడి స‌హాయంతో కూతుర్ని ఎలా కాపాడుకుంద‌నేది ఈ చిత్రంలోని ప్ర‌ధానాంశం. ఆ పాత్రలో సంగీత కనిపిస్తుందట.

More

Related Stories