అటు సంజయ్ దత్, ఇటు సైఫ్

Saif Ali Khan and Sanjay Dutt

తెలుగు సినిమా మేకర్స్ ఎప్పుడూ ఇతర భాషల్లో పేరొందిన నటులను ప్రతినాయకులుగా తీసుకుంటారు. వెనకటి నుంచి ఉంది ఆ ట్రెండ్. ఇప్పుడు బాలీవుడ్ హీరోలపై మనవాళ్ళ దృష్టి పడింది. ఒకప్పుడు పెద్ద హీరోలుగా చలామణీ అయిన సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాల్లో విలన్ వేషాలు వేస్తున్నారు.

సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ …. ఇద్దరూ ఇప్పుడు ప్రతినాయకులుగా బిజీ బిజీ. దక్షిణాది సినిమాలు పాన్ ఇండియన్ మార్కెట్ పై ఫోకస్ పెట్టడంతో హీరోయిన్, విలన్ పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ వైపు చూపేశాయి.

ప్రభాస్ హీరోగా రూపొందిన హిందీ/తెలుగు ద్విభాషా చిత్రం ‘ఆదిపురుష్’లో రావణాసురుడిగా నటించారు సైఫ్ అలీ ఖాన్. ఇక స్ట్రెయిట్ తెలుగు చిత్రం ‘ఎన్టీఆర్ 30’లో కూడా సైఫ్ అలీ ఖాన్ విలన్. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ లపై సన్నివేశాలు తీస్తున్నారు.

ఇక ‘కేజీఎఫ్ 2’ సినిమాతో సౌత్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన సంజయ్ దత్ తాజాగా రెండు కన్నడ చిత్రాలు, ఒక తమిళ చిత్రం, ఒక తెలుగు చిత్రం ఒప్పుకున్నారు. తెలుగులో ప్రభాస్ హీరోగా మారుతి తీస్తున్న కొత్త చిత్రంలో దత్ విలన్ గా నటిస్తున్నారు.

అలా సైఫ్, దత్ ఇక్కడ బిజీ అయిపోయారు. అన్నట్లు వీరి పారితోషికాలు కూడా భారీగానే ఉన్నాయి. ఒక మిడ్ రేంజ్ హీరోకి ఇచ్చే పారితోషికం వీళ్లకు ఇవ్వాలి.

Advertisement
 

More

Related Stories