సంజయ్ దత్ కి డిమాండ్!

Sanjay Dutt

ఒకప్పుడు సంజయ్ దత్ ఇండియాలోనే నంబర్ వన్ హీరో. “ఖల్ నాయక్” టైంలో ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత కేసులు, డ్రగ్స్ వల్ల సంజయ్ దత్ కెరీర్, లైఫ్ దెబ్బతింది. మళ్ళీ ‘మున్నాభాయ్’ చిత్రాలతో ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు విలన్ పాత్రలతో బిజీగా మారుతున్నారు.

సంజయ్ దత్ కెరీర్ కి కొత్త ఊపు తెచ్చింది “కేజీఎఫ్ 2”. ఇప్పుడు సౌత్ ఇండియాలో తెగ బిజీ అయిపోయారు. తమిళంలో విజయ్ నటిస్తున్న “లియో”, తెలుగులో ప్రభాస్- మారుతి సినిమాలో నటిస్తున్నారు. తాజాగా రామ్ హీరోగా పూరి తీస్తున్న “డబుల్ ఇస్మార్ట్”లో కూడా నటిస్తున్నారు.

సంజయ్ దత్ కి ఉన్న భారీ ఆకారం విలన్ పాత్రలకు సూట్ అవుతుంది. ఒకప్పుడు హీరోగా ఎంత సంపాదించారో ఇప్పుడు హీరోగానూ అంతే సంపాదిస్తున్నారట. విలన్ పాత్రలకు కూడా 10 కోట్లు తీసుకునే ఏకైక భారతీయ నటుడు సంజయ్ దత్ అనే చెప్పాలి.

ఆ మధ్య క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంజయ్ దత్ ఇప్పుడు హిందీ సినిమాలను వదిలి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలపై దృష్టి పెట్టారు. అలాగే మనవాళ్ళు కూడా ఆయన వైపే చూస్తున్నారు విలన్ పాత్రలకు.

Advertisement
 

More

Related Stories